తాజాగా ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను రెండు అనుచితమైన పదాలు ఉపయోగించినందుకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నానని శివాజీ తెలిపారు. స్టేజీ నుంచి దిగిన వెంటనే తన తప్పు ఎంత పెద్దదో తనకు అర్థమైందని, ఆ మాటలు చెప్పడం పూర్తిగా తప్పేనని ఆయన అంగీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నటుడు శివాజీ మాట్లాడుతూ “నేను ఆరోజు స్టేజీ మీద ఉన్న నా తోటి నటీనటులకు, ఆడబిడ్డలకు క్షమాపణలు చెబుతున్నాను. ఆ రెండు పదాలను మాట్లాడకుండా ఉండాల్సింది. జీవితంలో అలా పదాలను ఎప్పుడూ దొర్లలేదు. నేను ఇక్కడకు వచ్చి 30 సంత్సరాలవుతుంది. పాలిటిక్స్‌లో ఉన్నప్పటికీ ఏరోజు కూడా ఏ మహిళనైనా, పార్టీనైనా హద్దు దాటి మాట్లాడలేదు. అలాంటి భగవంతుడు ఎందుకో అలా చేశాడు. పదాలు అలా దొర్లిపోయాయి. ఆ విషయంలో చాలా బాధపడ్డాను. ఆ రెండు పదాలకు అందరికీ నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నాను. చాలా బాధపడుతున్నాను” అని అన్నారు.