న్యూఢిల్లీ : సర్ ప్రక్రియలో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, కేరళ, అండమాన్ నికోబార్‌లలో మంగళవారం వెల్లడించిన ముసాయిదా ఓటర్ల జాబితాల్లో 95 లక్షల మంది ఓటర్లను తొలగించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో 3.10 లక్షల ఓటర్లకుగాను 64,000 మంది పేర్లు జాబితాలో కనిపించడం లేదు. అదే విధంగా కేరళలో 2.78 కోట్ల ఓటర్లకు గాను 24.08 లక్షల ఓటర్లు, చత్తీస్‌గఢ్‌లో 2.12 కోట్ల ఓటర్లకుగాను 27.34లక్షల మంది పేర్లు, మధ్యప్రదేశ్‌లో 5.74 కోట్ల మంది ఓటర్లలో 42.74లక్షల ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు స్పష్టమైంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆయా రాష్ట్రాలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను వెల్లడిస్తారు. అయితే తుది జాబితా వెలువడకముందే ముసాయిదాలో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల సంఘం వెల్లడించింది.