హైదరాబాద్: విధులు ముగించుకుని వెళ్తున్న హోంగార్డును డిసిఎం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్, పిల్లర్ నంబర్ 192వద్ద మంగళవారం చోటుచేసుకుంది. టోలీచౌకి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సయిద్ అబ్దుల్ సత్తార్(40) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కుటుంబంతోపాటు హసన్‌నగర్‌లో ఉంటున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి బైక్‌పై వెళ్తుండగా పివిఎన్‌ఆర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ వద్ద వేగంగా దూసుకుని వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో అబ్దుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మృతిచెందారు.