రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ వద్ద నిర్మాణం లో ఉన్న రెండంతస్తుల భవనం పై నుండి పడి ఎలక్ట్రిషన్ వాజిద్ (32) మృతి చెందాడు. రెండంతస్తుల భవనంపై ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా బ్యాలెన్స్ తప్పి పడిపోయి 32 ఏళ్ల ఎలక్ట్రిషియన్ చెందాడు.స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని వాజిద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.