నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని గ్రోమోర్ ముందు ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి కడం మండలంలోని రైతులు ధర్నా చేశారు. యూరియా కోసం గత 3 రోజులుగా మండల కేంద్రంలోని గ్రోమోర్ ఆఫీస్ చుట్టూ రైతులు తిరిగిన యూరియా దొరకడం లేదని , యూరియాను చీకటి పడ్డాక జగిత్యాల జిల్లా రాయికల్ మండలానికి చెందిన వారికే యూరియా ఇస్తున్నారని కడం మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఎడిఎ సుజాత,ఎస్సై సాయికిరణ్ మాట్లాడారు.రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని ఎడిఎ సుజాత గ్రోమోర్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు ధర్నా విరమించారు.