తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి హుండీ ఆదాయం రూ.2,10,04,942 వచ్చినట్లు ఆలయ ఈవో వెంకట్రావు తెలిపారు. మంగళవారం కొండ కింద గల వ్రత మండపంలో స్వామివారి 29 రోజుల స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 75 గ్రాముల బంగారం, 5 కిలోల 600 గ్రాముల వెండిని భక్తులు హుండీలో సమర్పించినట్లు తెలిపారు. అమెరికా 844 డాలర్లు, ఇంగ్లాండ్ 45 పౌండ్స్, కెనడా 50 డాలర్స్, దిరామ్స్ 265, నేపాల్ 30, ఆస్ట్రేలియ 5, థాయ్ బాట్ 450, యూరోప్ 160, సింగపూర్ 79, రియల్ 16, బైసా 300, ఒమన్ 1ను భక్తులు హుండీలో సమర్పించినట్లు తెలిపారు.