సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ మరో ప్రతిష్టాత్మక వెంచర్ సిగ్మాతో రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ -అడ్వెంచర్ కామెడీగా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు అద్భుతమై స్పందన వచ్చింది. ఇప్పుడు మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. కథనం ఒక ట్రెజర్ హంట్ చుట్టూ తిరుగుతుందని టీజర్ సూచిస్తోంది. యాక్షన్, ట్విస్టులు, థ్రిల్స్‌తో నిండిన ఈ ప్రయాణం ఆసక్తిని మరింత పెంచుతుంది.
సుందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా నటిస్తుండగా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుధర్శనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేథరిన్ ఒక హై- ఎనర్జీ స్పెషల్ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. మల్టి లింగ్వల్ చిత్రంగా రూపొందుతున్న సిగ్మా 2026 సమ్మర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.