మహిళల డ్రెస్సులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టాలీవుడ్ సెలబ్రిటీలు ఫైరవుతున్నారు. ఇప్పటికే శివాజీపై మాకు ఫిర్యాదు చేశారు. డైరెక్టర్ నందినిరెడ్డి, నిర్మాత స్వప్నదత్, నటి మంచు లక్ష్మీ, ఝాన్సీ, సుప్రీయ యార్లగడ్డ.. శివాజీపై మా అధ్యక్షుడు మంచు విష్ణుకు వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఇక, హాట్ యాంకర్ అనసూయ కూడా శివాజీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో శివాజీ ఇన్‌సెక్యూరిటీతో ఉన్నారని విమర్శించారు. “ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్లేసుకుంటారు.. నచ్చినట్టు తింటారు.. నచ్చిన డ్రెస్ వేసుకుంటారు” అంటూ ఫైరయ్యారు అనసూయ.
కాగా, ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న శివాజీ.. మహిళల డ్రెస్సింగ్ మాట్లాడుతూ.. అమ్మాయిలు నిండుగా బట్టలు వేసుకుంటేనే అందంగా ఉంటారని.. అందంగా కనిపించడానికి.. సామాన్లు కనిపించేలా సగం సగం దుస్తులు వేసుకోవద్దని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.