మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో మొసలి సంచారం కలకలం సృష్టించింది. మద్దెలబండ చిన్న తండాలోని పొలాల్లో మొసలిని రైతులు గుర్తించారు. వెంటనే రైతులు తాళ్లతో మొసలిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు ఆగ్రామానికి చేరుకొని మొసలిని తీసుకెళ్లారు. చీకటిలో మొసలి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చీకటిలో మొసలిని రైతులు బలే గుర్తించారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.