హైదరాబాద్: సినీ నటి మంచు లక్ష్మి మంగళవారం సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ కోసం ఆమె లక్డీకపూల్‌లోని సిఐడి కార్యాలయానికి వచ్చారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కిమీషన్లపై అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. గతంలో ఈ కేసులో ఆమె ఇడి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. గతంలో ఆమెతో పాటు హీరో విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, రానాలు కూడా ఈ విచారణకు హాజరయ్యారు.