ముంబై: దుబాయి వేదికగా జరిగిన ఆసియా అండర్19 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో భారత యువ జట్టు పేలవమైన ప్రదర్శనతో ఘోర పరాజయం పాలుకావడంపై భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. జట్టు ప్రదర్శన ఇంత ఘోరంగా ఉండడాన్ని బిసిసిఐ తప్పుపట్టినట్టు సమాచారం. దీనిపై ప్రధాన కోచ్ హృషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేలతో అపెక్స్ కౌన్సిల్ సభ్యులు చర్చింనట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 191 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీన్ని బిసిసిఐ సీరియస్‌గా తీసుకుంది. ఆటగాళ్లు నిర్లక్షంగా ఆడడం వల్లే ఇలాంటి చేదు ఫలితం ఎదురైందని బిసిసిఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బిసిసిఐ జట్టులో మార్పులకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి.