త్రిపుల్ ఆర్ రైతులకు అండగా ఉండి వారి సమస్యల పరిస్కారం కోసం అందరం కలిసి ఉద్యమిద్దామని, త్రిపుల్ ఆర్ రైతులకు జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో భాగంగా భువనగిరి మున్సిపల్ పట్టణంలోని రాయిగిరి రైతులతో కలిసి మాట్లాడారు. అంతకు ముందు బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.వైద్య సదుపాయాలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. ఎయిమ్స్ సందర్శనకు వచ్చిన పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు మాట్లాడారు. ఎయిమ్స్ బిల్డింగ్ మోడల్‌ను చూపిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వైద్య అధికారులు వివరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎయిమ్స్ కీలకంగా మారుతుందన్నారు.బస్వాపురం బాధితులను పరామర్శించారు. అనంతరం బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన బాధితులతో మాట్లాడుతూ ఒరిజినల్ ప్రాణహిత-చెవేళ్ల ప్రాజెక్ట్ లో
బస్వాపూర్ 0.8 టీఎంసీల చిన్న రిజర్వాయర్‌గా ఉండేదని, కానీ రీడిజైన్ లో భాగంగా11.7 టీఎంసీల పెద్ద రిజర్వాయర్‌గా డిజైన్ చేసి బిఎన్ తిమ్మాపురం రైతులకు ఆగం చేశారని ప్రాజెక్టు ఈ డిజైనింగ్ పేరుతో తిమ్మాపురం గ్రామస్తులు మాత్రం పూర్తిగా వారి పొలాలను, ఇండ్లను కోల్పోయారని అన్నారు.రిజర్వాయర్ పక్కనే బస్వాపురం గ్రామానికి చెందిన ఇళ్లు ఉండటంతో ఊట కారణంగా ఇబ్బంది పడుతున్నారని వారికి రావాల్సిన పరిహారం కూడా దఫా దఫాలుగా ఇవ్వటంతో పరిపూర్ణంగా న్యాయం జరగలేదని గ్రామస్తులు భావిస్తున్నట్లు చెప్పారు.కొందరికైతే అసలు పరిహారమే రాలేదని. కట్టలో కలిపేసి వారి భూములు తీసుకున్నట్లు ఆరోపించిన్నట్లు తెలిపారు.దీనిపై రైతులు ప్రశ్నిస్తే అధికారులు స్పందించటం లేదు ఎందుకని ప్రశ్నించారు.జిల్లా కలెక్టర్ ఇక్కడకు వచ్చి ఎవరెవరికీ ఎందుకు పరిహారం రాలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ బాధ్యత వహించి ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కుటుంబంలో ఒకరికి జాబ్ ఇప్పిస్తామని మాట ఇచ్చారు. కానీ ఎవరికీ కూడా జాబ్ రాలేదని ఇలాంటి సమస్యలపై ఎమ్మెల్యే దృష్టి పెట్టి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో మేమే రైతులతో కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించే ప్రయత్నం చేస్తామని హెచ్చరించారు.