పార్ద గోపాల్, మేఘన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం డైమండ్ డెకాయిట్. సూర్య జి యాదవ్ దర్శకత్వంలో పార్ద గోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో పార్ద గోపాల్ మాట్లాడుతూ “ఒక ఫ్యామిలీ ఎమోషనల్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని 2026 ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం”అని అన్నారు. డైరెక్టర్ సూర్య జి యాదవ్ మాట్లాడుతూ ఈ సినిమా అంత కడప జిల్లాలోని 60 లొకేషన్స్‌లో తెరకెక్కించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మేఘన, మ్యూజిక్ డైరెక్టర్ పెద్దపల్లి రోహిత్ తదితరులు పాల్గొన్నారు.