మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో స ర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇ చ్చే అంశంలో గందరగోళం నెలకొంది. ముందు ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో వెంటనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉప సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను రద్దు చేసినట్లు వచ్చిన వార్తలపై ప్రభుత్వం స్పందించి ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని పం చాయతీరాజ్ శాఖ ప్రకటించింది. సో షల్ మీడియాలో వైరల్ అవుతున్న స ర్క్యూలర్ ఫేక్ అని కొట్టిపారేసింది. ఫేక్ స ర్కులర్ విడుదలై ప్రచారంలోకి వచ్చిన కొన్ని నిమిషాల్లోనే సవరించిన కొత్త మెమోను పం చాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. గతంలో మాదిరిగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు జా యింట్ చెక్ పవర్‌ను యధాతధంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రా మ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు
కొలువుదీరాయి. గ్రామ పంచాయతీల్లో అధికారులు కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్‌లతో ప్రమాణస్వీకారా లు చేయించి ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బాధ్యతలను సంబంధిత అధికారులు అప్పగించారు. ఇప్పటి వరకు కొనసాగిన ప్రత్యేక అధికారుల పాలన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రాకతో ముగిసిపోయింది. కా గా 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో ఉప సర్పంచికి జాయింట్ చెక్ పవ ర్ ఇవ్వడంతో ఇన్నాళ్లు ఆ పదవి కీలకంగా కొనసాగింది. ఎన్నికల సమయంలో నూ ఉప సర్పంచ్‌కు చాలా పోటీ నెలకొం ది. ఇప్పుడు ఉప సర్పంచ్‌లకు చెక్‌పవర్ ర ద్దు చేసినట్లు ప్రచారం జరిగిన మెమోపై తీవ్ర ఆందోళన చెందారు. తమకు ఉన్న ఏకైక అధికారం ఎక్కడ పోతుందోనని కంగారు పడ్డారు.
సవరించిన మెమోతో స్పష్టత
ఈ పరిస్థితిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జోక్యం చేసుకుని పంచాయతీరాజ్ శా ఖ డైరక్టర్ సృజనతో సంప్రదించి సవరించిన మెమోను విడుదల చేశారు. దీంతో గతంలో మాదిరిగా యధాతధంగా సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ కొనసాగుతుందని వెల్లడించింది. ప్రభుత్వం ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతి పంచాయతీలో ప్రత్యేక ఖాతా తెరవాలని ఆదేశించింది. ఈ నిధుల చెల్లింపులకు సర్పంచ్ , పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని పేర్కొంది. ఈ ప్రక్రియలో ఉప సర్పంచ్ పేరు ప్రస్తావించకపోవడంతో అధికారం రద్దయిందనే ప్రచారం జరిగిందని భావించినట్లు అధికార వర్గాల సమాచారం. అయితే వాస్తవానికి ఇది కేవలం కేంద్ర నిధుల నిర్వహణకు సంబంధించిన సాంకేతిక మార్పు మాత్రమేనని, గ్రామ పంచాయతీ సాధారణ నిధుల వినియోగంలో ఉప సర్పంచులకు గతంలో ఉండే అధికారం ప్రస్తుతానికి యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించడంతో స్పష్టత వచ్చింది. ఈ మెమో ప్రధానంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నిర్వహణకు సంబంధించింది. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను జమ చేయడానికి ప్రతి పంచాయతీలో ఒక ప్రత్యేక ఖాతాను తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఆర్థిక లావాదేవీలు పూర్తిగా డిజిటల్‌లోనే జరగాలనే కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ధేశించింది.
నగదు లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని సవరించిన మెమోలో పేర్కొంది. ప్రత్యేక ఖాతా నుండి నగదు ఉపసంహరణ లేదా చెల్లింపులు జరపాలంటే పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీఓ, సర్పంచ్ లేదా ఎంపీపీ ల డిజిటల్ సంతకాలు తప్పనిసరి అని మెమోలో పేర్కొంది. అయితే ఈ మెమోలో ఎక్కడా ఉప సర్పంచ్ పేరు ప్రస్తావించకపోవడంతో అది వారి అధికారాన్ని రద్దు చేసినట్లుగా సమాచార లోపం కారణంగా వార్త వైరల్ అయ్యిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం నుంచి అందే 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా ఆయా పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జమ అవుతున్నందున ప్రభుత్వం నిధుల వినియోగంలో ఏమాత్రం పొరపాట్లు జరగకుండా అన్నీ ఆన్‌లైన్ పేమెంట్లు, పటిష్టమైన బ్యాంకింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నిధులను జీతాలు తప్ప మిగిలిన స్థానిక అవసరాలకు వాడాల్సి ఉంటుందని కేంద్రప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, నీరు, పారిశుధ్యం, విద్యా కేంద్రాల అభివృద్ధి వంటి వాటికి వినియోగించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్రాలకు పంపుతుంది, ఆయా రాష్ట్రాలు అర్హతగల పంచాయతీలకు పంపిణీ చేస్తాయి. పంచాయతీలు తమ అభివృద్ధి ప్రణాళిక ప్రకారం ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉంటుంది.