మన తెలంగాణ/మోత్కూర్: గ్రామాలకు వచ్చే నిధులన్నింటినీ గ్రామాల అభివృద్ధికి వినియోగించి గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తామని నూతన సర్పంచులు ప్రకటించారు. మోత్కూరు మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఆయా గ్రామపంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించగా బాధ్యతలు స్వీకరించారు. దాచారం సర్పంచ్ కర్నె జ్యోతివీరేశంతో తహసీల్దార్ జ్యోతి, పాటిమట్ల సర్పంచ్ బండ రమవిజయరెడ్డితో ఏవో కీర్తి, సదర్శాపురం సర్పంచ్ మునుకుంట్ల నీలకంఠంతో ఇరిగేషన్ఏ ఈ అఖిల్, అనాజిపురం సర్పంచ్ బీసు వెంకటయ్యతో ఎంఈవో టి. గోపాల్ రెడ్డి, పొడిచేడు సర్పంచ్ జిట్ట సైదులుతో ఈ ఈ మంగులాల్, దత్తప్పగూడెం సర్పంచ్ గుండు యాదగిరితో ఎంపీవో జనార్దన్ రెడ్డి, పాలడుగు సర్పంచ్ అంతటి భగవంతుతో డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వర్ రెడ్డి, ముశిపట్ల సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డితో పీఆర్ ఏఈ శివ, పనకబండ సర్పంచ్ లోతుకుంట రేణుకఅనిల్ కుమార్తో ఎంపీడీవో బాలాజీనాయక్, రాగిబావి సర్పంచ్ మెండు శ్రీవాణి చంద్రశేఖర్రెడ్డితో ఎంపీవో జనార్దన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వారితో పాటు ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీల నూతన పాలకవర్గ సభ్యులను నాయకులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పని చేయడంతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు అందేలా చేస్తామని ప్రకటించారు.