సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఆదిత్య 999 మ్యాక్స్’తోనే మోక్షజ్ఞ కథానాయకుడిగా పరిచయం కానున్నట్టు బాలయ్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కాగా ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నాడు. ఇదివరకే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇతర క్యాస్టింగ్ పై క్రిష్ ఫోకస్ పెట్టాడట. ఈ సినిమాలో బలమైన క్యాస్టింగ్ కూడా ఉంటుందట. అలాగే మోక్షజ్ఞ లుక్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆ మధ్య తన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. “మోక్షజ్ఞను హీరోగా ఎలా పరిచయం చేయాలో నాకు తెలుసు. అతని కోసం ఒక ఐదు, ఆరు స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తున్నారు. అయితే క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలిసింది.