ఎసిబి వలకు మరో పెద్ద తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో మహబూబ్ నగర్ అదనపు రవాణా కమిషనర్ కిషన్ నాయక్‌ను ఎసిబి అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్ బోయినపల్లిలోని ఆర్‌ఆర్ నగర్‌లోని ఆయన నివాసంతో పాటు దాదాపు 12 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించి పెద్ద మొత్తంలో ఆస్తులను గుర్తించారు. హైదరాబాద్‌లో ఆరు చోట్ల, నిజామాబాద్‌లో మూడు చోట్ల, నారాయణ ఖేడ్‌లో మూడు చోట్ల ఎసిబి అధి కారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అక్రమ ఆస్తులను ఎసిబి అధికా రులు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్సులు, హోటళ్లు, స్థిర, చరాస్తులను గుర్తించారు. బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారాన్ని గుర్తించి ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులున్నట్లుగా ఎసిబి అధికారులు గుర్తిం చినట్లు సమా చారం. నారాయణ్‌ఖేడ్‌లో 30 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాల భూమికి సంబంధించిన అక్రమ ఆస్తు లను ఎసిబి అధికారులు గుర్తించారు.
పాట్ మార్కెట్ లోని అజిత్ గోల్డ్ దుకాణంలో కిషన్ నాయక్ పేరిటు ఉన్న బంగారాన్ని తీసుకువచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఒక కిలో బంగా రంతో పాటు నిజామాబాద్‌లోని లహరి అంతర్జాతీయ హోటల్, అపార్ట్‌మెంట్లకు సంబంధించిన పత్రా లను గుర్తిం చారు. డాక్యు మెంట్ విలువ రూ.12 కోట్ల పైగా అక్రమ ఆస్తులను గుర్తించామని, బహిరంగ మార్కెట్‌లో వాటి విలువ రెండింతలు పైబడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచ నాకు వచ్చినట్లు ఎసిబి అధికారులు తెలిపారు. అదే విధంగా దిల్‌సుఖ్‌నగర్‌లోని కిషన్ నాయక్ స్నేహి తుడు ఇంట్లోనూ ఎసిబి అధికారులు సోదా లు చేపట్టి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ 2024 డిసెంబర్‌లో మహ బూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు వచ్చి న నేపథ్యంలో ఎసిబి సోదాలు నిర్వహించింది. రాష్ట్రంలో అవినీతి నిరోదక శాఖ ఎన్ని దాడుల చేసిన అక్రమార్కుల ఆట కట్టిస్తున్నా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించుకుం టున్న వారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఒకవైపు ఎసిబి అధికారులు అన్నివైపుల సోదాలు చేస్తూ అక్రమా ర్కులకు అడ్డుకట్టలేస్తుంటే, మరోవైపు అవినీతి పరులు అక్రమదారిలో సొమ్ము చేసుకుని ఆస్తులను పెంచుకునేందుకు అక్రమార్జనకు పాల్పడుతుం డటం గమనార్హం.