మన తెలంగాణ/హైదరాబాద్: సాగునీటిపై ప్రభుత్వం ఇచ్చే పిపిటిని స్వాగతిస్తున్నామని.. కానీ, వాస్తవాలు చెప్పడానికి బిఆర్‌ఎస్‌కు కూడా పిపిటి ఇచ్చే అ వకాశం ఇవ్వాలని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు అన్నారు. ఎవరి వాదన నిజమో ప్రజలే తేల్చుతార ని చెప్పారు. సిపిఐ, ఎంఐఎం, బిజెపి కంటే తక్కువ సమయం మాకు ఇస్తూ గొంతు నొక్కుతున్నారు, మైకులు కట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. మాకు అవకాశం ఇస్తే అసెంబ్లీ సా క్షిగా కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బ యటపెడతామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రో జుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కృష్ణా జ లాల్లో నీటి వాడకం కేవలం 28.49% మాత్రమే అని చెప్పారు. తెలంగాణకు 45 టిఎంసిలు చాలు అని మంత్రి ఉత్త మ్ ఉత్తరం రాయడం చారిత్రక తప్పిదం అని పేర్కొన్నారు. దానికి క్షమాపణ చె ప్పి, వెంటనే 90 టిఎంసిల కోసం లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ మంత్రి హరీష్‌రావు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో సిట్‌లు ఒక ప్రహసనంగా మారాయన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారని, తమను కావాలని ఇబ్బంది పెడితే తెలంగాణలో కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు.
అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇవ్వాలని చెప్పారని తెలిసిందని పేర్కొన్నారు. ప్రజల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్న తమకు కేసులు కొత్తేమీ కాదని అన్నారు. ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా- ఈ రేస్ అంటూ లీకులు ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని, ఎపిలో అధికారులకు పట్టిన గతే వారికి పడుతుందని అన్నారు. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా గుంజుకొస్తామని హెచ్చరించారు. రాష్ట్రం తెచ్చిన వాళ్లం, తమది త్యాగాల చరిత్ర అని, రేవంత్ రెడ్డి అక్రమ కేసులకు, కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉద్యమంలో తనపై 300 కేసులు ఉన్నాయని, ఈ తాటాకు చప్పుళ్లకు భయపడం అని స్పష్టం చేశారు. డిజిపి శివధర్ రెడ్డికి ఫుట్‌బాల్ మ్యాచ్ రక్షణకే సమయం సరిపోతోందని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా సర్జాపూర్‌లో ఓటేయలేదని దళితులపై దాడులు చేసి ఇళ్లు కూలగొట్టినా కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాకీ పుస్తకం, చట్టం అందరికీ సమానంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కానిస్టేబుళ్ల ఆరోగ్య భద్రతను రూ. లక్షకు కుదించడం దుర్మార్గం అని, వారి టిఎ, డిఎ అలవెన్స్‌లపై టిజిపి దృష్టి పెట్టాలని కోరారు. దేవుడి మీద ఒట్టేసి రుణమాఫీ చేయలేదని యాదగిరిగుట్టలో వేడుకుంటే తనపై కేసు పెట్టారని, ఖమ్మం వరద బాధితులను పరామర్శించడానికి వెళ్తే దాడులు చేశారని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తామని తెలిపారు.
కెసిఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడింది
కెసిఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ సర్కార్ పూర్తి డిఫెన్స్‌లో పడిందని హరీష్‌రావు అన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమంత్రి రాత్రి 9.30 గంటలకు చిట్-చాట్ పెట్టి వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. అరడజను మంది మంత్రులు పోటీపడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కెసిఆర్ పవర్ అని పేర్కొన్నారు. అందాల పోటీలు, ఫుట్‌బాల్ షోకులు, గ్లోబల్ సమ్మిట్‌లు పేదలకు అన్నం పెడతాయా..? అని ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డికి సచివాలయం అంటేనే భయం పట్టుకుందని, వాస్తు భయంతో సెక్రటేరియట్ మెట్లు ఎక్కడం లేదని ఆరోపించారు. గేట్లు, తలుపులు మార్చినా భయం పోక కేవలం కమాండ్ కంట్రోల్ రూమ్‌కే పరిమితం అయ్యారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.. బిఆర్‌ఎస్ 4 వేల సర్పంచ్ స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. బిఆర్‌ఎస్ దెబ్బకు డిసిసిబిలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు.
దమ్ముంటే కో ఆపరేటివ్ ఎన్నికలు జరపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సిఎం రేవంత్‌రెడ్డి పోలీసులు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానని చెప్పి, పోలీస్ పహారాల మధ్య ఒయుకు వచ్చారని అన్నారు. విద్యార్థి నాయకులను అరెస్టు చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఇది ప్రభుత్వం కాదు.. ఒక కన్సల్టెన్సీ కంపెనీ అని, బొంబాయి బ్రోకర్ల సలహాలతో నడుస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. అప్పులు ఇప్పించినందుకు ఒక బ్రోకర్ కంపెనీకి గతంలోనే రూ. 180 కోట్ల కమిషన్ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జిహెచ్‌ఎంసిని మూడు ముక్కలు చేసి రూ. 30 వేల కోట్ల అప్పు తేవాలని చూస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట రూ. 7 వేల కోట్లను మంత్రులు ఉత్తమ్, భట్టిలు పంచుకున్నారని అన్నారు. 20 శాతం కమిషన్ ఇచ్చిన వారికే బిల్లులు ఇస్తున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు.