అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని మధురానగర్ లో 10 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ ను అమ్ముతుండగా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ప్రధాన నిందితుడి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. సెంటిని హాస్పిటల్ సమీపంలో కెకె గ్రాండ్ హోటల్ వద్ద డ్రగ్స్ ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మధురానగర్ కు చెందిన పారేటి వెంకట జగదీష్ కుమార్, సింగ్ నగర్ బాలిబోయిన అఖిలేశ్ లు డ్రగ్స్ అమ్ముతుండగా వారిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు చెందిన మరో ప్రధాన నిందితుడు దొడ్డు రాజేష్ పరారీలో ఉన్నారు. బెంగళూరు నుంచి ఎండమా ఎండిఎంఎ డ్రగ్స్ తీసుకొచ్చి విజయవాడలో అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు.