26 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కిలో మీటరుకు 1, 2 పైసల చొప్పున భారం
మెయిల్, ఎక్స్‌ప్రెస్, నాన్ ఎసి రైళ్లకు కిలోమీటరుకు 2పైసలు పెంపు
రైల్వేకు రూ.650 కోట్ల అదనపు ఆదాయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇక రైల్వే టికెట్ల చార్జీలు పెరుగుతున్నాయి. డిసెంబర్ 26 నుంచి కొత్త చార్జీల అమలు మొదలు కాబోతోంది. సబర్బన్ రైళ్ల చార్జీలను పెద్దగా పెంచనప్పటికీ, దూర ప్ర యాణాలు చేసే వారిపై మాత్రం చార్జీల పెంపుతో ఇబ్బందులు తప్పవు. పెంపు కిలోమీటర్‌కు సగటున 2 పైసలు ఉంటుంది. 215 కిలోమీటర్ల వరకూ జనరల్ క్లాస్ టికెట్ల ధర మారదు. కా నీ, 215 కిమీ కంటే ఎక్కువ దూరాలకు కి.మీ.కి 1 పైసా చొప్పున చార్జీలు పెరుగుతాయి. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఎయిర్ కండీషన్ లేని కోచ్‌లకు, కి.మీ.కి 2 పైసల చొప్పున పెంపు ఉంటుంది. ఎయిర్ కండీషన్డ్ కోచ్ లకు ప్రయాణ ఖర్చు కూడా కిమీకి 2 పైసలు పెరిగింది. కొత్త రేట్లు ప్రారంభమైన తర్వాత ఎయిర్ కండీషన్ లేని కోచ్ లలో 500 కిమీ ప్రయాణానికి రూ.10 ఎక్కువ ఖర్చవుతుంది. తాజా చార్జీల పెంపుదల వల్ల రైల్వే ఆదాయం రూ. 600 కోట్ల మేరకు పెరుగుతోంది.
గత పదేళ్లుగా రైల్వే తన నెట్ వర్క్ విస్తరించింది. రైల్వే కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. రైల్వేలో ఉద్యోగస్తులు పెరిగారు.దాంతో జీతాలు, ఇతర ఖర్చులు రూ.1,15,000 కోట్లకు పెన్షన్ ఖర్చు రూ. 60,000 కోట్ల కు పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్యకలాపాల ఖర్చు 2,63,000 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల ఖర్చులు పెరుగుదలను తీర్చేందుకు రైల్వేలు కార్గో లోడింగ్, ప్రయాణీకుల చార్జీలు పెంచడంపై దృష్టి సారించింది. గతంలో జూలైలో రైల్వే చార్జీలను పెంచాయి. మెయిల్ ,ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండీషన్ లేని తరగతుల చార్జీని కిమీ కు 1 పైస చొప్పున పెంచారు. ఎయిర్ కండీషన్డ్ తరగతుల్లో ప్రయాణం కిమీ కి రూ. 2 పైసలు చొప్పున పెరిగింది. అంతకు ముందు 2020 జనవరి 1 న రైల్వే చార్జీలు పెంచారు. 2020లో, ఆర్డినరీ, మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లకు సెకండ్ – క్లాస్ చార్జీలు వరుసగా కిమీ.కి 1 పైసా, 2 పైసలు పెరిగాయి. స్లీపర్ తరగతులు, అన్ని ఏసీ తరగతుల చార్జీలు వరుసగా కి.మీ కి 2 పైసల నుంచి 4 పైసలు పెరిగాయి.