మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ శీతాకాల విడిది ముగిసింది. ఆరు రోజుల శీతాకాల విడిది ముగించుకున్న రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యా రు. ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సిఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు వీడ్కోలు పలికారు.
ఈ నెల 17న హైదరా బాద్ చేరుకున్న ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ల, జాతీయ సద స్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మాకుమారీస్ శాంతి సరోవర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 21న రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ నిర్వహించారు. ప్రతి ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రావడం ఆనవాయతీ. ఈ సమ యంలో రాష్ట్రపతి నిలయం నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. 1860లో నిర్మించిన ఈ భవనం, 1948లో హైదరాబాద్ భారత్‌లో విలీనమైన తర్వాత రాష్ట్రపతి విడిది కేంద్రంగా మారింది.