మన తెలంగాణ / హైదరాబాద్: మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత బస్ పాస్ కార్డులను జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానిన ఆర్‌టిసి జెఎసి స్వాగతించింది. మహాలక్ష్మి పథకం ఆర్‌టిసిలో అమలు జరగబట్టి రెండేళ్లు కావొస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం వల్ల మహిళలకు ఆర్‌టిసి బస్ లలో ‘O‘ టికెట్ తో ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల కండక్టర్లు మహిలకు 0 టికెట్, పురుషులకు డబ్బుల టికెట్ ఇస్తున్నప్పుడు అధిక రద్దీ కారణంగా అనుకోకుండా పురుషులకు 0 టికెట్ రావడం వీటిపై టిటిఐ లు కేసులు నమోదు చేయడం జరుగుతోందని ఆర్‌టిసి జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, నాయకులు ఎం. థామస్ రెడ్డి(టిఎంయు), ఎండి మౌలానా (ఎన్‌ఎంయు), కత్తుల యాదయ్య (బికెయు), సుద్దాల సురేష్ (బిడబ్లుయు), బి.యాదగిరి (కెపి) తెలిపారు. అధికారులు ఈ కేసులకు గురైన వారిని నిర్ధాక్షణ్యంగా ఉద్యోగాల నుండి తీసివేయడం జరుగుతోందన్నారు.
ఈ విధానాన్ని ఆర్‌టిసి జెఎసి మొదటి నుండి వ్యతిరేకిస్తూ O టికెట్ బదులు ఉచిత బస్సు పాస్ కార్ద్ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందన్నారు. జెఎసి .దీనిపై పలు దఫ్ఫాలుగా ప్రభుత్వం, యాజమాన్యాల దృష్టికి తీసుకపోవడంతో పాటు జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతి పోరాట కార్యక్రమంలో ఈ డిమాండ్ ను పెట్టి వివిధ ప్రసార సాధనాలా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసినట్లు తెలిపారు. మే 6 న మంత్రితో జరిపిన చర్చలల్లో ఉచిత బస్ పాస్ గురించి ప్రస్థావించామని, మంత్రి సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.
కొంత ఆలస్యం అయినప్పటికీ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆర్‌టిసి సమీక్ష సమావేశంలో మహిళలకు O టికెట్ బదులు ఉచిత బస్ పాస్ కార్డు ఇవ్వాలని నిర్ణయిoచినట్లు చెప్పడం పట్ల జెఎసి హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలు యూనియన్ పునరుద్దరణ, 2021, 2025 వేతన సవరణ, ఉద్యోగ భద్రత, ప్రభుత్వంలో విలీనంతో పాటు పనిభారం తగ్గింపు, సిబ్బంది ఖాళీల భర్తీ తదితర ప్రధాన అంశాలను కూడా పరిష్కరించాలని జెఎసిగా కోరుతున్నామన్నారు. ఉచిత బస్ పాస్ కార్డు జారికి కృషి చేసిన ఆర్ధిక మంత్రి బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి నాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.