జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందారం గ్రామ శివారులో బోలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆగి ఉన్నబొలెరోను లారీ ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.