రూపాయల నోట్లపై ఉన్న గాంధీ చిత్రాన్ని తొలగించి సావర్కర్ చిత్రాన్ని పెట్టాలనే కుట్రను కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని ఏఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు అనుమానం వ్యక్తం చేశారు. హిందూ పేరిట రాజకీయాలు చేసి లబ్ది పొందాలని బిజెపి ప్రయత్నిస్తున్నదని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగత్ దేశాన్ని హిందూ దేశంగా సంభోదిస్తున్నారని ఆయన విమర్శించారు.