హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్‌పై మంత్ర శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దని కెసిఆర్ కోరుకుంటున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. ఈ నెల 8, 9 తేదీల్లో జరిగిన గ్లోబల్ సమిట్‌లో కుదిరిన ఎంవొయులను కెసిఆర్ తక్కువ చేసి మాట్లాడరని మండిపడ్డారు. ఒక్క ఏడాదిలోనే 75 గ్లోబల్ కేపబులిటీ సెంటర్లను తీసుకొచ్చామని తెలిపారు. అత్యధిక జిసిసిలు వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. గతేడాది రూ.3.40 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకువచ్చామని.. ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థ ఇక్కడే పరిశ్రమ పెట్టేలా చూస్తామని హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ హయాంలోనూ ఒప్పందం చేసుకున్న ప్రతి పరిశ్రమ రాలేదని అన్నారు. హైదరాబాద్‌కు వచ్చేందుకు ఎన్నో అంతర్జాతీయ వర్సిటీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.