సరైన హిట్ కోసం గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు హీరో శర్వానంద్. 2024లో ‘మనమే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇప్పుడు ‘నారీ నారీ నడుమ మూరారీ’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకొనేందుకు శర్వా సిద్ధమయ్యాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక టీజర్ విషయానికొస్తే.. కామెడీ బాగానే పండింది. విజువల్స్, మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆఫీస్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన హీరో, హీరోయిన్‌తో పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ, అతడి టీమ్ లీడ్‌గా మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఈమెకి గతంలో హీరోతో లవ్ స్టోరీ ఉంటుంది. మరి ఇద్దరు హీరోయిన్లలో హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అనేది సినిమా కథ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక ఈ సినిమాకి ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా.. అని సుంకర నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా.. 2026 జనవరి 14వ తేదీ సాయంత్రం 5.49 గంటలకు థియేటర్లలో సందడి చేయనుంది.