ఇండియన్ సినీ చరిత్రలో చిరస్థాయలో నిలిచిపోయే చిత్రం ‘దృశ్యం’. క్రైమ్ థ్రిలర్ ప్రేక్షకులను ఎంతో అలరించింది. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రీమేక్ చేశారు. తెలుగులో వెంటకేష్ ప్రధాన పాత్రాలో నటించగా.. హిందీలో అజయ్ దేవ్‌గన్ హీరోగా నటించారు. ఇక దీని సీక్వెల్ కూడా ఘన విజయం సాధించింది. ఇప్పుడు మూడు పార్ట్ రాకకు రంగం సిద్ధమైంది. హిందీలో ‘దృశ్యం-3’కి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియోని చిత్ర యూనిట్ అవిడుదల చేసింది. అందులో ఈ సినిమా 2026, అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మరి ‘దృశ్యం-2’ ప్రేక్షకులకు ఎంత మేరకు వినోదాన్ని పంచుతుందో వేచి చూడాలి.