ఛాంపియన్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు భారీ చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. గిర గిర సాంగ్ అన్ని ప్లాట్ ఫామ్‌లలో ట్రెండ్ అవుతూనే ఉండగా, మనసుని కదిలించే సెకండ్ సింగిల్ సల్లంగుడాలే కూడా అద్భుతమైన స్పందన అందుకుంది. రోషన్, అనస్వర రాజన్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ చిత్రం నుంచి మూడో పాటను ఇప్పుడు మేకర్స్ లాంచ్ చేశారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలమ్స్‌తో కలిసి స్వప్న సినిమా నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పించారు. మిక్కీజె మేయర్ సంగీతం అందించారు.
మూడో సింగిల్ ఐ యామ్ ఎ ఛాంపియన్ సాంగ్ ఒక ప్రత్యేకమైన, పూర్తిస్థాయి డాన్స్ నంబర్‌గా అలరించింది. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలనే భావనను ప్రతిబింబించే కేకే సాహిత్యం పాటకు బలం చేకూరుస్తే, పి.జయరామ్, రమ్య బెహరా తమ ఎనర్జిటిక్ గాత్రంతో పాట ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. డాన్స్ ఫ్లోర్‌పై రోషన్ అదరగొట్టాడు. జాజ్ బీట్స్‌కు అనుగుణంగా అతని బాడీ లాంగ్వేజ్, స్టెప్స్ ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. అవంతిక కూడా అదే ఎనర్జీతో కనిపించింది, వారి మధ్య కెమిస్ట్రీ తెరపై అదిరిపోయేలా వర్క్ అయింది. ‘ఛాంపియన్’ ఈ క్రిస్మస్‌కు బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా డిసెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.