హైదరాబాద్: అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీసుల పాతబస్తీలో ఆపరేషన్ నిర్వహించారు. పాతబస్తీలోని బాలాపూర్, చాంద్రాయణగుట్ట, పహడి షరీఫ్ ప్రాంతాలలో పోలీసుల ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో ఆవారాగా తిరుగుతున్న పోకిరీల భరతం పట్టారు. పోలీసులు పోకిరీలను వెంటాడి వేటాడి చితకబాదారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరీలకు పోలీసులు బుద్ధి చెప్పారు. రెండోసారి తమకు చిక్కితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ పోకిరీలకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.