ప్రభాస్ గత కొంతకాలంగా ఒక సినిమా పూర్తి కాకుండానే మరో సిని మా షూటింగ్‌తో బిజీ అయిపోతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమా వచ్చే నెల విడుదల అవుతుంది. కాబట్టి ఇక సెట్ మీద రెండు చిత్రాలు ఉన్నాయి. అవి ఫౌజీ, స్పిరిట్. ఇందులో ఫౌజీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. దాంతో ఇప్పుడు స్పిరిట్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇక ఈ పాన్ ఇండియా స్టార్ ఇటీవలే జపాన్ నుంచి వచ్చారు. రాగానే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ప్రభాస్ ఈ డిసెంబర్ 31, జనవరి 1 సంబరాలను కూడా రద్దు చేసుకున్నారు. జనవరి మొదటి వారం వరకు స్పిరిట్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత బ్రేక్ తీసుకుంటారట. కొద్ది రోజులు ది రాజా సాబ్ ప్రమోషన్ లలో కూడా ప్రభాస్ పాల్గొంటారు. మొత్తమ్మీద జనవరిలో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ఈ సారి న్యూఇయర్ సంబరాల కోసం షూటింగ్ రద్దు చేయడం లేదు. 2026లో ప్రభాస్…- స్పిరిట్, ఫౌజీ – పూర్తి చేయాలి. ఆ తర్వాత ఫ్రెష్‌గా కల్కి 2, సలార్ 2 మొదలుపెడుతారు.