అడిలైడ్: యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్ 82 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో 3-0 తేడాతో ఈ సిరీస్‌లో ఆసీస్ గెలుపొందింది. చివరి ఇన్నింగ్స్‌లో 435 పరుగుల లక్షంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 352 పరుగులు చేసి ఆలౌట్ కావడంతో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. ఈ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో భారీ హాఫ్ సెంచరీ చేయడంతో అలెక్స్ కారేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 371
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 349
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 286
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 352