దుబాయ్: అండర్-19 ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యన్ని చేధించడంలో భారత్ ఘోరంగా విఫలమవుతోంది. ఆరంభంలో ఇన్నింగ్స్‌ని దూకుడుగానే ప్రారంభించినా.. 32 పరుగుల వద్డ కెప్టెన్ ఆయుష్ మాత్రే(2) ఔట్ అయ్యాడు. అనంతరం కీలక ఆటగాడు ఆరోన్ జార్జ్(16) పెవిలియన్ చేరాడు. ఆ వెంటనే వైభవ్ సూర్యవంశీ(26) కూడా తన వికెట్‌ని సమర్పించుకున్నాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. క్రీజ్‌లో విహాన్ మల్హోత్రా(6), వేదాంత్ త్రివేది(1) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే భారత్‌కు ఇంకా 289 పరుగులు కావాల్సి ఉంది.