హైదరాబాద్: యోగా, ధ్యానం చేయడంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తెలిపారు. భారత దేశం ఓ ఆధ్యాత్మిక కేంద్రం అని, డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా యుఎన్‌ఒ ప్రకటించిందన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు రాధాకృష్ణన్ ముందుగా అభినందనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో హార్ట్ ఫుల్ నెస్ సంస్థ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధర్వంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం జరిగింది. ఒకే వేదికపైన సిపి రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. శాంతి, సామరస్యం, ఆధ్యాత్మికతను హార్ట్‌ఫుల్‌నెస్ ప్రోత్సహిస్తోందని, అందరూ ధ్యానం చేసేలా దాజీ ప్రోత్సహిస్తున్నారని, భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఉపకరిస్తోందని, ధ్యానం చేస్తున్న వారి మనసు ఏకాగ్రతతో ఉంటుందని, మానసిక ప్రశాంతత కోసం అందరూ ధ్యానం చేయాలని సూచించారు. వికసిత్ భారత్-2047 లక్షంగా ప్రధాని మోడీ పని చేస్తున్నారని ప్రశంసించారు. వికసిత్ భారత్‌లో ఆర్థికాభివృద్ధే కాదని, దేశ శాంతి భాగంగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు, తదితరలు పాల్గొన్నారు.