మాస్ మహారాజా రవితేజ.. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ’భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో ఈ సంక్రాంతికి అద్భుతమైన వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 13న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ కిషోర్ తిరుమల మాట్లాడుతూ “కచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుంది.
రవితేజకి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయాలని ఉద్దేశంతోనే ఈ కథ రాయడం జరిగింది. సినిమాలో ఆయన చాలా ఫ్రెష్‌గా కనిపిస్తారు”అని అన్నారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ఈ సంక్రాంతికి రావాలని ఉద్దేశంతోనే ఈ సినిమాని చేశాం అని తెలిపారు. హీరోయిన్ డింపుల్ మాట్లాడుతూ “ఇందులో నా క్యారెక్టర్ పేరు బాలామణి. ఇందులో ఒక కొత్త డింపుల్ ని చూస్తారు”అని తెలియజేశారు. ఈ సమావేశంలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ పాల్గొన్నారు.