అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘బొమ్మ హిట్‘ చిత్రాన్ని అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెంబర్ 1గా గుర్రాల్ సంధ్యారాణి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో రాజేశ్ గడ్డం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పూజా యడం హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైం ది. ఈ సందర్భంగా డైరెక్టర్ రాజేష్ గడ్డం మాట్లాడుతూ “బొమ్మ హిట్ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే సమ్మర్‌కు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం”అని అన్నారు. ఈ వేడుకలో హీరో అభినవ్ మణికంఠ, హీరోయిన్ పూజా యడం, నిర్మాత గుర్రాల సంధ్యారాణి మురళీధర్ గౌడ్, హైపర్ ఆది, జబర్దస్త్ అవినాశ్ పాల్గొన్నారు.