మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన సిట్ టీం దూకుడు పెంచింది. సుప్రీంకోర్టు విచారణకు మరో వారం గడువు పెంచ డంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావును శనివారం సిట్ టీం విచారించింది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీసుస్టేషన్‌లో విచారించారు. నూతన సిట్ టీం ఏర్పాటుతో బషీర్ బాగ్‌లోని సిసిఎస్‌లో విచారిం చారు. ప్రభాకర్ రావు విచారణ ప్రక్రియను సిపి సజ్జనార్ పరిశీలించారు. రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారనే అంశం పైన ప్రధానంగా దృష్టి సారించారు. విచారణ అనంతరం ఆయనను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డిసెంబర్ 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రభాకర్ రావును జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వసతి ఏర్పాటు చేసి విచారించారు.
తాజాగా సిట్ కార్యాలయం మార్చేందుకు కార్యా చరణ చేస్తున్నట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ఐపిఎస్ స్థాయి హోదాలో పని చేయడంతో అదే స్థాయి ఐపిఎస్ అధికారులతో విచారణ ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీస్ రిపోర్ట్ విచారణలో కీలకం కానుంది. మరో ఆరు రోజుల పాటు సిట్ బృందం ప్రభాకర్‌రావును విచారించనుంది. హార్డ్ డిస్క్‌ల ధ్వంసంతో పాటు మొబైల్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని ప్రభాకర్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. వారం రోజుల విచారణ అనంతరం ఆ రిపోర్టును సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించ నుంది. ఈ వారం రోజుల విచారణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.