కన్నడ రాక్‌స్టార్ యశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్స్ వచ్చి చాలాకాలమే అయింది. ‘కె.జి.ఎఫ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రమిది కావడంతో దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారనే టాక్ కూడా ఉంది. అందులో ఒక హీరోయిన్ నిజమైంది. ఈ సినిమాలో అందాల భామ కియారా అడ్వాణీ నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది.
తాజాగా ‘టాక్సిక్’ నుంచి కియారా ఫస్ట్‌లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో కియారా.. నదియా అనే పాత్రలో కనిపిస్తుందని పేర్కొంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా కరీనా కపూర్, నయనతార, శృతి హాసన్ తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. మరి వీరిలో ఎవరు హీరోయిన్లుగా ఫిక్స్ అవుతారో అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా గురించి యశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చిన్నారుల గురించి ఎన్నో సినిమాలు వచ్చాయని.. ఇది పెద్దలకు సందేశమిచ్చే చిత్రమిది అని పేర్కొన్నారు. అందుకే ‘ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోస్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టామని అన్నారు.