అమరావతి: బాలికను మాయమాటలు చెప్పి బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ఆమెపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామంలో శంకరయ్య అనే వ్యక్తికి కుమారుడు మురళి(49) ఉన్నాడు. అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై మురళి అత్యాచారం చేశాడు. బాలిక భయపడి ఈ విషయం ఎవరికి చెప్పలేదు. బాలికకు అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులకు చెప్పింది. బాలికను చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించగా 22 వారాల గర్భవతి అని తేలింది. తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 2012లో అతడిపై కేసులు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.