అడిలైడ్: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మరో రెండు టెస్టులు మిగిలివుండగానే 30 తేడాతో యాషెస్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 435 పరుగుల క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 352 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో సఫలమయ్యారు. ఓపెనర్ జాక్ క్రాలీ (85) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జో రూట్ (39), హ్యారీ బ్రూక్ (30), జేమీ స్మిత్ (60), విల్‌జాక్స్ (47), బ్రైడన్ కార్స్ 39 (నాటౌట్) రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లియాన్ మూడేసి వికెట్లను పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371, రెండో ఇన్నింగ్స్‌లో349 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది.