మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ నూతన కార్యదర్శిగా ఆర్. తిరుపతి నియమితులయ్యారు. రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్న తిరుపతిని అసెంబ్లీ కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు శనివారం జివో విడుదల విడుదల చేశారు. ఇదిలాఉండగా ఇప్పటి వరకు అసెంబ్లీ, కౌన్సిల్ (శాసనపరిషత్తు) కార్యదర్శిగా ఉన్న డాక్టర్ వి. నరసింహా చార్యులును కౌన్సిల్ కార్యదర్శిగా నియమిస్తూ అదే జివోలో ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు ఐదు దశాబ్దాల తర్వాత జిల్లా జడ్జి (లీగల్ అధికారి) స్థాయి అధికారిని నియమించడం గమనార్హం. గతంలో 1971 సంవత్సరంలో లీగల్ అధికారి శంకర్ రెడ్డి అసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.