దిస్‌పూర్: ఏనుగులను ఢీకొట్టి అనంతరం రైలు పట్టాలు తప్పింది. ఈ సంఘటన అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ వెళ్తుండగా జమున్ ముఖ కాన్పూర్ ప్రాంతంలోని ఎనిమిది ఏనుగులు రైల్వే ట్రాక్‌లపైకి వచ్చాయి. రైలు ఢీకొట్టడంతో ఎనిమిది ఏనుగులు ఘటనా స్థలంలోనే చనిపోయాయి. ఈ ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. గౌహతికి 126 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రైల్వే పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు.