సాయి సింహాద్రి సైన్మా పతాకంపై నిర్మాత సాయి సింహాద్రి హీరోగా నటిస్తూ… నిర్మించిన చిత్రం ‘సన్ ఆఫ్’. బత్తల సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సతీష్ మాట్లాడుతూ… ‘ఈ చిత్రం వినోద్ కుమార్‌కి కమ్ బ్యాక్ అవుతుంది. మా హీరో సాయి సింహాద్రి కూడా నన్ను నమ్మి అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా చేశారు. కొడుకు తండ్రి మీద ఎందుకు కేసు వేశాడు అనేది చాలా బలంగా ఈ సినిమాలో చూపించాం”అని అన్నారు. హీరో సాయి సింహాద్రి మాట్లాడుతూ “ఈ కథ రియల్ లైఫ్ లో నాకూ, మా నాన్నకు కనెక్ట్ అవుతుంది.
ఇందులో డ్రామా, ఎమోషన్ కూడా ఉంటుంది. ప్రతి కొడుకు… తన తండ్రికి చూపించాల్సిన సినిమా ఇది. ఎంతో నిజాయితీగా సినిమాని తీశాం”అని తెలిపారు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ… “ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ సినిమా కాదు.. స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. రెగ్యులర్ లైఫ్‌లో ఓ తం డ్రి, కొడుకుల మధ్య సాగే స్టోరీ ఇది. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నేను ప్రస్తుతం గోపీచం ద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. మారెమ్మ చిత్రంలో నటిస్తున్నా. అలాగే సు హాసినితో కలిసి ఓ సినిమా చేస్తున్నా”అని తెలియజేశారు. కార్యక్రమంలో చిత్రం శీను, రిషి పాల్గొన్నారు.