కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ ‘బ్యాండ్ మేళం’. ఈ చిత్రంలో ‘కోర్ట్’ చిత్రంతో ప్రేక్షకుల మన్నలు అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి అపళ్ల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ కోన వెంకట్ ఈ క్రేజీ కాంబోని తీసుకొస్తున్నారు. కావ్య, శ్రావ్య ఈ చిత్రానికి నిర్మాతలు. శనివారం పుట్టినరోజుని జరుపుకుంటోన్న శ్రీదేవికి బర్త్‌డేను మరింత కలర్‌ఫుల్‌గా చేయడానికి మేకర్స్ సినిమా నుంచి బర్త్ డే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇక సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాల కలయికగా రూపొందుతోన్న ఈ అందమైన కథను సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్నారు.