హైదరాబాద్: టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని.. విభిన్నమైన పాత్రలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతడు నటించిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. దీంతో స్క్రిప్ట్ సెలక్షన్‌లో రామ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా అతడు నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోకి వీరాభిమాని పాత్రలో ఆకట్టుకున్నాడు రామ్. గత నెల 27న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది….
భాగ్వశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ క్రిస్మస్ కానుకగా.. ప్రముఖ ఒటిటి ‘నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఒటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ పోస్టర్‌ని విడుదల చేసింది. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించగా.. వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు. మరి థియేటర్‌లలో ఫర్వాలేదని అనిపించిన ఈ చిత్రం ఒటిటిలో