అమరావతి: కాంగ్రెస్ విషవృక్షం అని తెలంగాణ ప్రజలు గమనించలేక పోయారని కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ మూర్ఖ పాలనకు విసిగిపోయి కన్ఫ్యూజన్ లో కాంగ్రెస్ ఓటేశారని అన్నారు. ఈ సందర్భంగా విశాఖ సభలో బండిసంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ హస్తం ఇవాళ తెలంగాణ ప్రజలకు భస్మాసర హస్తంగా మారిందని విమర్శించారు. ఎపిలో డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలియజేశారు. ఎపిని తాము స్ఫూర్తిగా తీసుకుంటామని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ను కూకటివేళ్లతో పెకిలిస్తామని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్ర నిధులు తప్ప.. రాష్ట్రం దగ్గర నిధులు లేవని బండిసంజయ్ పేర్కొన్నారు.