హారర్ సినిమాలంటే ఇష్టపడే వాళ్లు చాలా మందే ఉంటారు. ఎంత భయంగా ఉన్నా సరే.. కళ్లకు చేతులు అడ్డం పెట్టుకొని మరీ హారర్ సినిమాలు చూస్తుంటారు. అందుకే సినిమాల్లో హారర్ జోనర్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్తిస్థాయి హారర్ జోన్‌లో సినిమాను తెరకెక్కిస్తే.. అది మినిమం గ్యారెంటీగా ఆడుతుంది. అలా హారర్ జోనర్‌లో త్వరలో ప్రేక్షకుల ముందు రాబోతున్న చిత్రం ‘ఈషా’. త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్ని చాలా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘ఈషా వార్నింగ్’ అనే పేరుతో ఈ చిన్న గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లోని సన్నివేశాలు భయానకంగా ఉన్నాయి. ‘ఆత్మ అంటే అదేనేమో’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌ని బట్టి చూస్తే.. ఈ సినిమా ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని హారర్ ప్రేమికులకు ఆసక్తిని పెంచుతోంది. శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.