మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను ఈగల్ టీమ్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరా బాద్, సైబరాబాద్, వరంగల్ అంతటా ఈగల్ టీమ్, పోలీసు శాఖతో కలిసి నిర్వహించిన వివిధ దాడులలో ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేశారు. నిందితుల నుండి మొత్తం 330 గ్రాముల గంజాయి, 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండిఎంఎ, ఒక కారు, ఒక మోటార్ సైకిల్, ఐదు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటి కేసులో ఈగల్‌కు చెందిన వరంగల్ నార్కోటిక్స్ పోలీసులు, వరంగల్ పోలీసులతో కలిసి హుజురాబాద్‌లోని రంగాపూర్‌కు చెందిన రెడ్డబోయిన కార్తీక్ (25) అనే వెల్డర్, రెడ్డబోయిన రాజేష్ (18) అనే రైతు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
పోలీసులు వారి నుండి 50 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు మరియు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీ నం చేసుకున్నారు. విచారణలో, కార్తీక్ హన్మకొండకు చెందిన ఎండీ ఫర్దీన్ అనే వ్యక్తి నుండి గంజాయిని సేకరిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ సమా చారం ఆధారంగా, పోలీసులు హన్మకొండలోని రెడ్డి కాలనీలో సోదాలు నిర్వహించి, కార్ కిట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎండీ ఫర్దీన్ (21) ను అరెస్టు చేసి, 30 గ్రాముల గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్తీక్, రాజేష్‌లను హుజురాబాద్ పోలీసులకు అప్ప గించ గా, ఎండీ ఫర్దీన్‌ను తదుపరి చట్టపరమైన చర్యల కోసం హన్మకొండ పోలీసులకు అప్పగించారు.
వరంగల్‌లో గంజాయి సప్లై చేస్తున్న ముగ్గురితో పాటుగా, మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో 250 గ్రాముల గంజాయితో ఒకరు, మసాబ్ ట్యాంకులో డ్రగ్స్‌తో ఇద్దరు పట్టు బడ్డారు. నిందితు లు ఎపి, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర గంజాయి సరఫరాదారులుగా ఈగల్ టీమ్ గుర్తించింది. కాగా నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఏటా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతుంటాయి. ఏడాది పొడవునా జరిగే మత్తు పదార్ధాల వ్యాపారంలో 8090 శాతం డిసెంబర్ జనవరి మధ్య అవుతుం దని అంచనా. ఈ క్రమంలో ఈగల్ టీమ్ మెరుపు దాడులు నిర్వహిస్తోంది. దీంతో డ్రగ్స్ పెడ్లర్లు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు.