హైదరాబాద్: బాయ్ ఫ్రెండ్‌తో ప్లాట్‌లో ఉండగా తండ్రి రావడంతో కూతురు పక్క ప్లాట్‌లోకి దూకబోయి ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పాతబస్తీకి చెందిన ఓ యువతి(20) నగరంలో ఓ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న యువకుడు పరిచయం కావడంతో ప్రేమలో పడింది. తెల్లపూర్ పరిధిలోని అపార్టుమెంట్‌లో ఆమెకు రెండు పడక గదులు ఉన్నాయి. గురువారం యువకుడితో కలిసి యువత ఆ ప్లాట్‌కు వచ్చింది. అదే సమయంలో రేషన్ బియ్యం కోసం తండ్రి అదే ప్లాట్‌కు వచ్చాడు. ప్లాటుకు బయట తాళం వేసి ఉండడంతో లోపల ఎవరో ఉన్నట్లు గురించి కేకలు వేయడంతో కూతరు భయపడింది. పక్క ప్లాట్‌లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. తప్పించుకునే క్రమంలో ఎనిమిదో అంతస్తు నుంచి కిందపడడంతో ఘటనా స్థలంలోనే యువతి చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.