సౌతాఫ్రికాతో జరిగిన ఐదు టి-20ల సిరీస్‌ని భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసింది. దీంతో ఈ ఏడాదిని విజయంతో ముగించింది టీం ఇండియా. శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడయంలో జరిగిన ఆఖరి (ఐదో) టి-20లో సౌతాఫ్రికాన చిత్తు చేసి.. విమర్శకుల నోళ్లు మూయించింది సూర్యకుమార్ సేన.
అయితే సూర్య ప్రదర్శనలో మాత్రం మార్పు లేదు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బ్యాట్స్‌మెన్‌గా సూర్య విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో మొత్తంగా సూర్య చేసింది 34 పరుగులే. ఈ విషయంపై సూర్యమ్యాచ్ అనంతరం మాట్లాడాడు.. ‘‘ఈ సిరీస్‌లో ఎలా అడాలని అనుకున్నామో అలాగే ఆడి ఫలితాన్ని రాబట్టాము. మేమేమీ కొత్తగా ట్రై చేయలేదు. ప్రతి విభాగంలో పటిష్టం కావాలని భావించాం. దాని ఫలితం మీ ముందే ఉంది. దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నాం. బుమ్రాతో పవర్‌ప్లేలో ఒక్క ఓవరే వేయించి.. డెత్ ఓవర్‌లో బౌలింగ్ చేయించాలని అనుకున్నాము. ఈ సిరీస్‌లో అన్ని ప్రయత్నించి చూశాము’’ అని సూర్య అన్నాడు. అయితే ‘‘సూర్య ది బ్యాటర్’’ని మాత్రం మేము మిస్సయ్యాము. అతడు ఎక్కడో తప్పిపోయాడు. త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడు’’ అని సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌గా వైఫల్యాన్ని ఒప్పుకున్నాడు.