ఆది సాయి కుమార్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక హీరోయిన్లుగా నటించారు. 1980ల నాటి శంబాల గ్రామంలో ఉల్కాపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. భౌగోళిక శాస్త్రవేత్తగా ఆది సాయికుమార్ నటన ఆకట్టుకుంటుంది. రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘పదే.. పదే’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘శంబాల’ స్టోరీని కాస్త రివీల్ చేసేలా హీరో ఫ్యామిలీ గురించి, ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టం వివరించేలా ఇది సాగుతోంది. ఈ పాటని యామిని ఘంటశాల పాడగా.. కిట్టూ విస్సాప్రగఢ సాహిత్యం అందించారు. శ్రీచరణ్ పాకాలా అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా మంచి బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. అన్ని హక్కుల కొనుగోళ్లు పూర్తయినట్లు సమాచారం. మరి ఈ సినిమాతోనైనా.. ఆది సాయి కుమార్‌కి మంచి హిట్ పడుతుందో లేదో చూడాలి.